తెలంగాణలో సినిమా థియేటర్ల మనుగడకు మేలు కలిగే నిర్ణయం ఇది: చిరంజీవి
- తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించారు
- నిర్మాతలకు, థియేటర్ల యాజమాన్యానికి న్యాయం చేస్తున్నారు
- సినిమా టికెట్ రేట్స్ సవరించినందుకు కేసీఆర్ గారికి థ్యాంక్స్
తెలంగాణలో సినీ పరిశ్రమకు, థియేటర్లకు గుడ్‌న్యూస్ చెబుతూ టికెట్ల ధరలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. థియేటర్లలో టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు అమల్లోకి తీసుకురావడంతో సినీ పరిశ్రమకు చెందిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సర్కారుకి కృతజ్ఞతలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంపై స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఆయన ట్వీట్ చేశారు.
'తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీ దారులకు, థియేటర్ల యాజమాన్యానికి, అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది' అని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, చిరంజీవి చేసిన ట్వీట్ పట్ల నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలను తగ్గించిన విషయాన్ని ప్రస్తావిస్తూ దానిపై మాట్లాడాలని సూచిస్తున్నారు.