పులివెందులకు మంచి కంపెనీ వస్తోంది.. 2 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయి: సీఎం జగన్

  • కడప జిల్లాలో సీఎం జగన్ రెండోరోజు పర్యటన
  • పులివెందులలో ఆదిత్య బిర్లా టెక్స్ టైల్ పరిశ్రమకు శంకుస్థాపన
  • ఆదిత్య బిర్లా కంపెనీ ఫార్చ్యూన్-500లో ఒకటని వెల్లడి
  • పులివెందుల ప్రజలకు అనేక ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న సీఎం   
కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఆయన ఇవాళ పులివెందుల ఇండస్ట్రియల్ పార్క్ లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పులివెందులకు మంచి కంపెనీ వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. రూ.110 కోట్లతో ఆదిత్య బిర్లా కంపెనీ టెక్స్ టైల్స్ పరిశ్రమ వస్తోందని తెలిపారు. ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఆదిత్య బిర్లా సంస్థ కూడా ఒకటని వివరించారు.

పులివెందులలో ఆదిత్య బిర్లా కంపెనీ ఏర్పాటు ద్వారా తొలిదశలో 2 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. పులివెందుల ప్రజలకు అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సీఎం చెప్పారు. అంతకుముందు సీఎం జగన్ వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రికి ఘననివాళులు అర్పించారు.


More Telugu News