డిసెంబర్ లో కారు కొంటే ఎన్ని ప్రయోజనాలో.. కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి మరి!
- ఈ ఏడాది పండుగల విక్రయాలు అంతంతే
- దీంతో పెరిగిన వాహన నిల్వలు
- వాటిని తగ్గించుకునేందుకు కంపెనీల ఆఫర్లు
- రెనో డస్టర్ పై రూ.1.3 లక్షల తగ్గింపు
- టాటా, హోండా కార్లపైనా తగ్గింపులు
కారు కొనుగోలు చేసుకునే వారికి డిసెంబర్ మాసం ఎంతో అనుకూలమా? అని ప్రశ్నిస్తే దీనికి సూటిగా ఒక్కటే సమాధానం చెప్పడం కష్టం. ప్రయోజనాలు ఎక్కువే ఉన్నాయి. అదే సమయంలో కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయని చెప్పుకోవాలి.
సాధారణంగా డిసెంబర్ అనేది సంవత్సరంలో ఆఖరి మాసం. దీంతో తమ దగ్గరున్న వాహన నిల్వలను సాధ్యమైన మేర తగ్గించుకునేందుకు కంపెనీలు ప్రయత్నం చేస్తుంటాయి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో అవి పలు మార్పులతో ఆయా మోడళ్లను సరికొత్తగా పరిచయం చేస్తుంటాయి. ఇందులో భాగంగా డీలర్లకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుంటాయి. ఆ మేరకు ఆఫర్లను డీలర్లు కొనుగోలుదారులకు బదలాయిస్తుంటారు. కనుక పండుగల సమయాల్లో మంచి ఆఫర్లను కోల్పోయామే? అనుకునే వారు డిసెంబర్ లో అంతకంటే ఆకర్షణీయమైన తగ్గింపులు ఉన్నాయేమో విచారించుకోవచ్చు.
ఈ ఏడాది పండుగల సమయాల్లో విక్రయాలు పెద్దగా నమోదు కాలేదు. కరోనా మహమ్మారితో మారిన ఆర్థిక పరిస్థితులు, పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ ప్రవేశం చేస్తుండడంతో ఒక సెక్షన్ ప్రజల్లో నెలకొన్న అయోమయం కూడా ఇందుకు కారణం. విక్రయాలు జోరుగా లేనందున కంపెనీల వద్ద నిల్వలు ఎక్కువే ఉంటాయి. కనుక అవి ఆకర్షణీయమైన ఆఫర్లతో అమ్మకాలు పెంచుకునే వ్యూహాలను అనుసరించొచ్చు. పాత కార్లను కొత్త కార్లతో ఎక్చేంజ్ చేసుకోవడంపైనా ఈ నెలలో మంచి ఆఫర్లు పలకరిస్తుంటాయి.
హోండా కార్స్ అయితే ఎక్చేంజ్ బోనస్ అంటూ ప్రత్యేకంగా రూ.9,000ను ఆఫర్ చేస్తోంది. వారంటీల పొడిగింపు, ఉచిత యాక్సెసరీలు, ఉచిత బీమా సదుపాయాన్ని కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. రెనో కంపెనీ డస్టర్ పై రూ.1.3 లక్షలను తగ్గింపునిస్తోంది. టాటా మోటార్స్ అయితే సఫారీ, హారియర్ మోడళ్లపై రూ.40,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
కాకపోతే వాహనానికి సంవత్సరం అన్నది కీలకం. రిజిస్ట్రేషన్ అయిన సంవత్సరాన్నే కొనుగోలుదారులు పరిగణనలోకి తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ అయిన సంవత్సరానికి చెందిన మోడల్ గా చూస్తారు. డిసెంబర్ లో కొనుగోలు చేసినా తర్వాతి సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనుకుంటారు. కానీ, కేవలం కొన్ని రోజుల్లోనే అది ఏడాది పాత మోడల్ గా మారిపోతుంది. దాంతో ఆ మేరకు విలువ కూడా తగ్గిపోతుందని గుర్తుంచుకోవాలి. వెంటనే విక్రయించకుండా.. దీర్ఘ కాలం పాటు కారును వాడుకునే వారికి డిసెంబర్ లో కొనుగోలు లాభదాయకమే.