టికెట్ రేట్ల వివాదం.. ఏపీ మంత్రులపై హీరో సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు!
- మీ లగ్జరీల కోసం మేము పన్నులు చెల్లిస్తున్నాం
- అవినీతి ద్వారా రాజకీయ నాయకులు లక్షల కోట్లు సంపాదించారు
- మీ విలాసాలు తగ్గించుకుని మాకు డిస్కౌంట్ ఇవ్వండి
ఏపీలో సినిమా టికెట్ల ధరలను తగ్గించిన వ్యవహారం ముదురుతోంది. ధరలను తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రేక్షకులు చాలామంది సమర్థిస్తుండగా... చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. హీరో నాని స్పందన తర్వాత వైసీపీకి చెందిన బొత్స, కన్నబాబు, అంబటి రాంబాబు వంటి నేతలు విరుచుకుపడ్డారు. పారితోషికం ఎంత తీసుకుంటున్నారో వెల్లడించని హీరోలకు టికెట్ ధరల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అంబటి అన్నారు.
మరోవైపు ఈ అంశంపై హీరో సిద్ధార్థ్ తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'సినిమా ఖర్చు తగ్గించుకుని, కస్టమర్లకు డిస్కౌంట్లు ఇవ్వాలని మాట్లాడే మంత్రుల్లారా... మేము ట్యాక్స్ పేయర్స్. మీ లగ్జరీల కోసం మేము పన్నులు చెల్లిస్తున్నాం. అవినీతి ద్వారా రాజకీయ నాయకులు లక్షల కోట్లు సంపాదించారు. మీ విలాసాలను తగ్గించుకుని, మాకు డిస్కౌంట్ ఇవ్వండి' అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఇదెక్కడి లాజిక్ అంటూ రాజకీయ నాయకులను ఉద్దేశించి హ్యాష్ ట్యాగ్ జత చేశారు.