నాని అసలు ఏం మాట్లాడాడో అర్థం కావడంలేదు: మంత్రి కన్నబాబు
- టికెట్ రేట్లు తగ్గించి ప్రజలను అవమానించారన్న నాని
- నాని వ్యాఖ్యలను తప్పుబట్టిన కన్నబాబు
- సినిమా థియేటర్లలో దోపిడీ సాగుతోందని వెల్లడి
- అందుకే చర్యలు తీసుకుంటున్నామని వివరణ
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం తీవ్రరూపు దాల్చుతోంది. ఇవాళ హీరో నాని చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు బదులిచ్చారు. నాని అసలు ఏం మాట్లాడాడో తనకు అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించడం అంటే ప్రజలను అవమానించినట్టేనని నాని పేర్కొనడాన్ని కన్నబాబు తప్పుబట్టారు. టికెట్ల ధరలు తగ్గిస్తే ప్రజలను అవమానించినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
సినిమా థియేటర్లలో పలు విధాలుగా దోపిడీ జరుగుతోందని, సినిమా టికెట్ల ధరలు, తినుబండారాలు, పార్కింగ్ రుసుం... ఇలా ఏది తీసుకున్నా దోపిడీయేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం బాధ్యత అని కన్నబాబు ఉద్ఘాటించారు. అందుకే టికెట్ల ధరలు తగ్గించామని, తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు.