వైసీపీ అంటే 'ఏమీ చేతగాని ప్రభుత్వం' అని అర్థం: జీవీఎల్

  • వైసీపీకి కొత్త భాష్యం చెప్పిన జీవీఎల్
  • వైసీపీ అసమర్థతను ప్రజలకు నివేదిస్తామని వ్యాఖ్య  
  • కేంద్రం నిధులు ఇస్తున్నా వినియోగించుకోవడంలేదని ఆరోపణ
  • ఈ నెల 28న విజయవాడలో భారీ సభ
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీ పర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక వైఫల్యం అనే అంశంపై ఎవరైనా అధ్యయనం చేయాల్సి వస్తే అందుకు ఏపీనే సరైన రాష్ట్రం అని వ్యాఖ్యానించారు. తాజాగా ఓటీఎస్ పేరుతో కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు.

కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టి రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇస్తున్నా ఉపయోగించుకోవడం లేదని విమర్శించారు. యూపీ తర్వాత కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు అందుకుంటున్న రాష్ట్రం ఏపీనే అని స్పష్టం చేశారు.  

కేంద్ర పథకాలు అమలు చేయాలంటే... కేంద్రం, రాష్ట్రం రెండూ నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని, అయితే కేంద్రం నిధులు విడుదల చేసినా రాష్ట్రం నుంచి నిధులు రావడంలేదని జీవీఎల్ ఆరోపించారు. దాంతో కేంద్రం నిధులు కూడా ఆగిపోయాయని, వైసీపీ అసమర్థతతో అభివృద్ధికి ఏపీ ఆమడదూరంలో నిలిచిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వైసీపీకి కొత్త భాష్యం చెప్పారు. వైసీపీ అంటే 'ఏమీ చేతకాని ప్రభుత్వం' అని నిర్వచించారు. వైసీపీ అసమర్థతను ప్రజలకు తెలియజేస్తామని, ఈ నెల 28న విజయవాడలో భారీ బహిరంగ సభ ఉంటుందని జీవీఎల్ తెలిపారు.


More Telugu News