ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు: హీరో నాని సంచలన వ్యాఖ్యలు
- టికెట్ల ధరలను తగ్గించడం సరైన నిర్ణయం కాదు
- థియేటర్ల కంటే కిరాణా షాపులకే ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయి
- టికెట్ ధర ఎక్కువగా ఉన్నా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది
సినిమా టికెట్ ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించడంపై సినీ హీరో నాని బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్రభుత్వ నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'శ్యామ్ సింగరాయ్' చిత్రబృందం ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ... సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించిందని, ఇది సరైన నిర్ణయం కాదని అన్నాడు. టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని పేర్కొన్నాడు. సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయని చెప్పాడు. టికెట్ ధర ఎక్కువగా ఉన్నా కొని, సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని అన్నాడు. అయినా, ఇప్పుడు తాను ఏది మాట్లాడినా వివాదాస్పదమే అవుతుందని నాని అభిప్రాయపడ్డాడు.