ఊళ్లో ఒమిక్రాన్ కేసు... 10 రోజుల సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్న తెలంగాణలోని ఓ గ్రామ ప్రజలు!

  • రాజన్న సిరిసిల్ల జిల్లా గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు
  • దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్
  • అతని తల్లి, భార్యకు కరోనా పాజిటివ్
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 38 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒక కేసు నమోదైంది. ఇటీవల దుబాయ్ నుంచి గూడెంకు వచ్చిన ఒక వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అంతేకాదు అతని తల్లి, భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో ఆ ఊరి ప్రజలు అందరిలో స్ఫూర్తిని నింపేలా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. గ్రామంలో 10 రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకున్నారు.


More Telugu News