'రామానుజాచార్య'గా బాలయ్య .. దర్శకుడిగా రాఘవేంద్రరావు!

'రామానుజాచార్య'గా బాలయ్య .. దర్శకుడిగా రాఘవేంద్రరావు!
  • రాఘవేంద్రరావు నుంచి మరో భక్తి చిత్రం
  • ప్రస్తుతం స్క్రిప్ట్ పై జరుగుతున్న కసరత్తు
  • గతంలో బాలయ్యతో చేసిన 'పాండురంగడు'
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్  
తెలుగులో జానపద .. పౌరాణికాలకు సరిపోయే రూపం బాలకృష్ణ సొంతం. అలాంటి బాలకృష్ణ కథానాయకుడిగా 'ఆదిశంకరాచార్య' సినిమా రూపొందనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇది విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన 'రామానుజాచార్య' జీవితకథతో కూడిన సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు.

ఆ మధ్య రాఘవేంద్రరావు వరుసగా భక్తి చిత్రాలను తెరకెక్కించారు. బాలకృష్ణ కథానాయకుడిగా 'పాండురంగడు' సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అయితే అది 'శ్రీరామదాసు' .. 'అన్నమయ్య' సరసన నిలబడలేకపోయింది. ఇప్పుడు ఇద్దరూ కూడా 'రామానుజాచార్య' చేయనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం 'రామానుజాచార్య' జీవితాన్ని సినిమాకి సరిపోయే కథగా మలిచే పనిలో ప్రముఖ రచయిత జేకే భారవి ఉన్నారని అంటున్నారు. గతంలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన భక్తి చిత్రాలకు ఆయన పనిచేశారు. స్క్రిప్ట్ సిద్ధమైన తరువాత ఈ సినిమాను గురించిన ఎనౌన్స్ మెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. తన ఇమేజ్ కి భిన్నంగా వెళ్లడానికి బాలకృష్ణ నిర్ణయించుకోవడం నిజంగా విశేషమే.


More Telugu News