లవ్ జిహాద్ చట్టం కింద తొలి శిక్ష.. యూపీ యువకుడికి పదేళ్ల జైలు శిక్ష
- మున్నాగా పేరు మార్చుకున్న జావెద్
- బాలికను ప్రేమిస్తున్నట్టు నమ్మించి ఇంటి నుంచి తీసుకెళ్లి వివాహం
- ఆపై నిఖా చేసుకోవాలంటూ అసలు రంగు బయటపెట్టిన జావెద్
లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కింద తొలి శిక్ష పడింది. లవ్ జిహాద్‌కు పాల్పడినందుకు గాను కాన్పూరుకు చెందిన యువకుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 30 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో శిక్ష పడిన యువకుడి పేరు జావెద్. 2017లో అతడు తన పేరును మున్నాగా మార్చుకున్నాడు. ఆపై ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నట్టు నమ్మించాడు. తర్వాత ఇంటి నుంచి ఆమెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.
జావెద్ ఆ తర్వాత తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. తాను ముస్లింనని, నిఖా చేసుకోవాలని బలవంతం చేశాడు. అందుకామె నిరాకరించడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జావెద్‌ను అరెస్ట్ చేశారు. బలవంతపు మతమార్పిడి, పోక్సో చట్టంతోపాటు వివిధ సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మతమార్పిడి కోసమే ఆమెను పెళ్లి చేసుకున్నట్టు వెల్లడైంది. దీంతో కోర్టు జావెద్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ. 30 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా చట్టం తెచ్చిన తర్వాత ఇప్పటి వరకు యూపీలో 108 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా బరేలీ జోన్‌లో 28, మీరట్ జోన్‌లో 25, గోరఖ్‌పూర్ జోన్‌లో 11, లక్నో, ఆగ్రా జోన్‌లలో 9 చొప్పున, ప్రయాగ్‌రాజ్, గౌతమ్ బుద్ధనగర్‌లలో ఏడేసి, వారణాసి, లక్నోలలో ఆరేసి కేసులు నమోదయ్యాయి. కాన్పూరులో రెండు కేసులు నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.