దేశంలో మరిన్ని ఒమిక్రాన్ కేసుల నిర్ధారణ
- దేశంలో కొత్తగా 7,495 కరోనా కేసులు
- నిన్న 434 మంది మృతి
- ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 236
- ఒమిక్రాన్ నుంచి కోలుకున్న వారు మొత్తం 104 మంది
దేశంలో కొత్తగా 7,495 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న 6,960 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కరోనా వల్ల 434 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో మొత్తం 78,291 మంది చికిత్స తీసుకుంటున్నారు.
కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,08,926కు చేరింది. కరోనా మరణాల సంఖ్య మొత్తం 4,78,759కి పెరిగింది. దేశంలో మొత్తం 1,39,69,76,774 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
కాగా, దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో ఇప్పటివరకు మొత్తం 104 మంది కోలుకున్నారు.