కేశినేని నానికి కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు
- విజయవాడ పశ్చిమ సమన్వయకర్తగా కేశినేని నాని
- కమిటీలు నియమించే అధికారం అప్పగింత
- గతంలో ఏర్పాటు చేసిన కమిటీలు పక్కనబెట్టాలన్న టీడీపీ
- రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా మధుబాబు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించారు. అంతేకాదు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఎంపీ కేశినేని నానిని నియమించారు. రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా చిరుమామిళ్ల మధుబాబుకు అవకాశం ఇచ్చారు. మాచర్ల నియోజకవర్గం ఇన్చార్జిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి, విశాఖ సౌత్ నియోజకవర్గం ఇన్చార్జిగా గండి బాబ్జిలను నియమించారు.
కాగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని నానికి మరింత స్వేచ్ఛ కల్పించారు. డివిజన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసే అధికారాన్ని కట్టబెట్టారు. గతంలో బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా నియమించిన కమిటీలను పక్కనబెట్టాలని టీడీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా నియామకాలకు, నిర్ణయాలకు పార్టీ అధినేత చంద్రబాబు ఆమోదముద్ర వేశారు.