మిమ్మల్ని 70వ దశకానికి తీసుకెళతాను: నాని
- ఈ నెల 24న 'శ్యామ్ సింగ రాయ్' రిలీజ్
- జోరందుకున్న ప్రమోషన్స్
- దేవదాసీ వ్యవస్థ చుట్టూ అల్లుకున్న కథ
- సహజత్వమే ప్రధాన బలమన్న నాని
'శ్యామ్ సింగ రాయ్' సినిమా ఈనెల 24వ తేదీన భారీస్థాయిలో థియేటర్స్ కి రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ .. "ఇలాంటి కథలు చాలా తక్కువగా తెరపైకి వస్తుంటాయి. ఈ తరహా కథలు వర్కౌట్ కావాలంటే అందుకు తగిన సాంకేతిక బృందం దొరకాలి. మంచి సాంకేతిక నిపుణులు దొరకడం వలన స్టార్ట్ చేసిన సినిమా ఇది.
ఇక ఈ సినిమా చూస్తుంటే మేము సెట్లో ఉన్నట్టుగా .. మీరు థియేటర్లో ఉన్నట్టుగా అనిపించదు. మనందరం 70వ దశకంలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అంతటి సహజత్వమే ఈ సినిమా ప్రత్యేకత. చూసిన తరువాత మీరంతా కూడా ఇదే మాట అంటారు.
అప్పట్లో దేవదాసీ వ్యవస్థని ప్రశ్నించే 'శ్యామ్ సింగ రాయ్' పాత్రలో నేను కనిపిస్తాను. ప్రేమకథను కలుపుకుంటూనే అసలు కథ నడుస్తూ ఉంటుంది. అందువలన ఈ కథ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ సినిమాలోని ఒక నాలుగు అంశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమాను నిలబెట్టడానికి అవి సరిపోతాయి. అంతగా అవి ఆడియన్స్ పై ప్రభావం చూపుతాయి" అని చెప్పుకొచ్చాడు.