ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు
- నవంబరు 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
- ఒకరోజు ముందే ముగిసిన వైనం
- 11 బిల్లులు ఆమోదం పొందాయన్న కేంద్రమంత్రి
- పలు చట్టాలకు సవరణలు చేసిన కేంద్రం
నవంబరు 29 నుంచి జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. వాస్తవానికి ఈ నెల 23తో ముగియాల్సి ఉండగా, ఒకరోజు ముందే ముగించారు. ఈ సమావేశాల్లో మొత్తం 11 బిల్లులు ఆమోదం పొందినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
వ్యవసాయ చట్టం రద్దు బిల్లు, మాదక ద్రవ్యాల నిరోధక చట్టం సవరణ బిల్లు, ఆనకట్టల భద్రత బిల్లు, సరోగసీ బిల్లు, ఎన్నికల సంస్కరణల సవరణ బిల్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సవరణ బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ సవరణ బిల్లుతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు, సర్వీస్ కండిషన్ సవరణ బిల్లు, మరికొన్ని ఇతర బిల్లులు ఆమోదం పొందాయి.
కాగా, నేటి సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానిని కలిసిన వారిలో మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, సంజీవ్ కుమార్, వంగా గీత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రెడ్డప్ప, సత్యవతి ఉన్నారు.