కేసీఆర్, మంత్రులు వాడుతున్న భాష సరిగా లేదు: డీకే అరుణ

  • కేంద్ర మంత్రులపై టీఆర్ఎస్ నేతల భాష సరిగా లేదు
  • ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పియూష్ గోయల్ చెప్పారు
  • రాష్ట్ర మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు
టీఆర్ఎస్ నేతలు ఉపయోగిస్తున్న భాష సంస్కారవంతంగా లేదని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. కేంద్ర మంత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు వాడుతున్న భాష సరిగా లేదని మండిపడ్డారు. గత ఏడాది ఖరీఫ్, రబీలో రాష్ట్ర ప్రభుత్వం కొన్న 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రానికి ఇవ్వాల్సి ఉందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పష్టంగా చెప్పారని... ఈ ఏడాది ఖరీఫ్ లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారని తెలిపారు. మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారని అన్నారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని... మరోవైపు కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News