ఏ ఒక్క ఆర్యవైశ్యుడు నావల్ల బాధపడినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: బాలినేని
- ఒంగోలు వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి
- తీవ్రంగా కొట్టిన సుభానీ అనే వ్యక్తి
- సుభానీ మంత్రి బాలినేని అనుచరుడేనంటూ మీడియాలో కథనాలు
- టీడీపీ కుయుక్తులు పన్నుతోందన్న బాలినేని
- వైశ్యులను రెచ్చగొడుతున్నారని ఆరోపణ
ఒంగోలు వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి వ్యవహారం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇబ్బందికరంగా మారింది. సుబ్బారావు గుప్తాను తీవ్రంగా కొట్టిన సుభానీ... బాలినేని అనుచరుడేనంటూ మీడియా, విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై మంత్రి బాలినేని స్పందించారు.
"బాలినేని నాపై దాడి చేయించలేదు" అని స్వయంగా సుబ్బారావు గుప్తానే చెప్పినా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. "గతంలో చెన్నైలో బంగారం వ్యాపారి డబ్బుతో దొరికితే నాదేనని అసత్య ప్రచారం చేశారు. టీడీపీ నేతలు అదేపనిగా కుయుక్తులు పన్నుతున్నారు" అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ కోసం పనిచేసే మీడియానే ఈ దుష్ప్రచారానికి పాల్పడుతోందని ఆరోపించారు. వ్యాపారి పత్తి రామకృష్ణ మరణానికి అప్పటి టీడీపీ సర్కారు కారణమైతే ఈ మీడియా ఎక్కడుందని ప్రశ్నించారు.
తాజాగా వైశ్యుల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సుబ్బారావు గుప్తాపై దాడి జరిగితే తానే స్వయంగా కేసు పెట్టించానని బాలినేని వెల్లడించారు. ఏ ఒక్క ఆర్యవైశ్యుడు తన వల్ల బాధపడినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.