దయచేసి వాళ్ల జీతాలు వారికి ఇప్పించండి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలలుగా జీతాలు లేవు
- వాళ్లు బతికేదెలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు?
- మీ చర్యలతో వాళ్లకి తీవ్రస్థాయిలో ఇబ్బందులు
ఆంధ్రప్రదేశ్ లో పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులను అర్థం చేసుకోవాలని రాష్ట్ర సీఎం జగన్‌ను గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోతే వారు ఎలా బతుకుతారని ఆయన సీఎంను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
'పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు లేవు. వాళ్లు బతికేదెలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు? మీ చర్యలతో వాళ్లు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో ముఖ్యమైనవని చెబుతున్న మీరు ఇప్పుడు ఇలా వాళ్లను విస్మరిస్తున్నారు. దయచేసి వాళ్ల జీతాలు వారికి ఇప్పించండి' అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు.