దేశంలో కొత్త‌గా 6,317 క‌రోనా కేసులు.. ఒమిక్రాన్ కేసుల పూర్తి వివ‌రాలు ఇవిగో

  • నిన్న‌ 318 మంది మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 78,190
  • ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 213
  • తెలంగాణ‌లో మొత్తం 24 ఒమిక్రాన్ కేసులు
దేశంలో కొత్త‌గా 6,317 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, నిన్న‌ 318 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా నుంచి నిన్న‌ 6,906 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 575 రోజుల క‌నిష్ఠానికి చేరుకుంది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 78,190 మంది క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల మొత్తం 4,78,325 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరోపక్క, దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 213కు చేరింద‌ని కేంద్ర వైద్య శాఖ వివ‌రించింది. వాటిల్లో ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌ల్లో 57, 54 కేసులు ఉన్నాయని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు 90 ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు కోలుకున్నార‌ని వివ‌రించింది. కాగా, తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 24 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. వారంద‌రికీ చికిత్స అందుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక‌రికి ఒమిక్రాన్ సోక‌గా, చికిత్స అనంత‌రం కోలుకున్నారు.

ఒమిక్రాన్ కేసుల పూర్తి వివ‌రాలు..
          


More Telugu News