నా వెనుక సుకుమార్ ఉన్నాడు: అల్లు అర్జున్
- తిరుపతిలో 'పుష్ప' సక్సెస్ మీట్
- చిత్తూరు యాస కోసం కష్టపడ్డాను
- ఈ క్రెడిట్ అంతా సుకుమార్ దే
- రష్మికతో పనిచేయడం ఆనందంగా ఉందన్న బన్నీ
'తగ్గేదే లే' అన్నట్టుగానే టాక్ తో సంబంధం లేకుండా 'పుష్ప' సినిమా దూసుకుపోతోంది. విదులైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ ను టచ్ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ తిరుపతిలో నిన్న సాయంత్రం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.
ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ .. "చిత్తూరు యాసను నేర్చుకోవడానికి రెండు సంవత్సరాలు కష్టపడ్డాను. ఈ రోజున మీ అందరి రెస్పాన్స్ చూస్తుంటే, మేముపడిన కష్టమంతా కూడా మరిచిపోతున్నాము. ఈ సినిమాలో నేను చేసిన పాత్రకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుంది. ఆ క్రెడిట్ అంతా కూడా సుకుమార్ కే చెందుతుంది.
ఈ సినిమా సక్సెస్ మీట్ ను తిరుపతిలో నిర్వహించడం ఆనందంగా ఉంది. మీ అందరి వెనుక ఆ ఏడుకొండలవాడు ఎలా ఉన్నాడో .. నా వెనుక సుకుమార్ అలా ఉన్నాడు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. రష్మికతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. శ్రీవల్లిగానే కాదు . రష్మికగా కూడా తను అంటే నాకు ఇష్టమే" అంటూ చెప్పుకొచ్చాడు.