తెలంగాణలో 4.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత.. లంబసింగిలో సున్నా డిగ్రీలు నమోదయ్యే అవకాశం!
- తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా
- పాడేరు, అరకులో 9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
- మరో ఐదు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందన్న అధికారులు
ఇరు తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. రాత్రిపూట, ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. పొగమంచుకు చల్లటి గాలులు కూడా తోడు కావడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఏపీ ఏజెన్సీలోని పాడేరు, అరకులో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. మినుములూరులో 8 డిగ్రీలకు పడిపోయింది. మరోవైపు ఈ సీజన్ లో లంబసింగిలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ విషయానికి వస్తే, కొమురం భీమ్ జిల్లా గిన్నెధరిలో 4.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 5.9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జన్నారంలో 6.1, బజార్ హత్నూర్ లో 6.1, వాంకిడిలో 6.11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలోనే ఉంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.