బెంగళూరులో భూప్రకంపనలు.. వణికిపోయిన జనం!

  • ఉత్తర, ఈశాన్య బెంగళూరులో ప్రకంపనలు
  • రిక్టర్ స్కేలుపై 3.3 తీవ్రత నమోదు
  • భూమికి 23 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
కర్ణాటక రాజధాని బెంగళూరులో భూకంపం సంభవించింది. ఉత్తర, ఈశాన్య బెంగళూరులో భూప్రకంపనలు జనాలను వణికించాయి. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా ఉంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ ఉదయం 7.14 గంటలకు ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. భూకంప కేంద్రం భూమికి 23 కిలోమీటర్ల లోతున ఉందని చెప్పింది. భూప్రకంపనలతో ఉలిక్కి పడిన జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ప్రకంపనలు ఆగిపోయిన తర్వాత మళ్లీ ఇళ్లలోకి అడుగుపెట్టారు.


More Telugu News