భారత్‌పై విద్వేషపూరిత ప్రచారం.. పాక్ కు చెందిన 20 యూట్యూబ్ చానళ్లు, రెండు వెబ్‌సైట్లపై కొరడా
- పాకిస్థాన్ కేంద్రంగా యూట్యూబ్ చానళ్లు
- కశ్మీర్ అంశం, భారత సైన్యం, రామ మందిరం వంటి అంశాలపై రెచ్చగొట్టేలా కథనాలు
- నిషేధం విధించిన కేంద్రం
భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ కేంద్రంగా దుష్ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ చానళ్లు, రెండు వెబ్‌సైట్లపై భారత ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. కశ్మీర్ అంశం, భారత సైన్యం, రామ మందిరం, మైనారిటీలు, దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తదితర అంశాలపై విద్వేష పూరిత ప్రచారం చేస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
సున్నితమైన అంశాలపై వార్తలను ప్రసారం చేయడం ద్వారా దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు, అల్లర్లు రేకెత్తించేందుకు ఇవి ప్రయత్నిస్తున్నట్టు సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ యూట్యూబ్ చానళ్లలో చాలా వరకు నయా పాకిస్థాన్ గ్రూప్ (ఎన్‌పీజీ)కు చెందినవేనని గుర్తించారు. వీటన్నింటికీ కలిపి 35 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నట్టు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.