తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ కేసుల నమోదు
- తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య
- 24కి చేరిన కొత్త వేరియంట్ కేసులు
- దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ
- చెరో 54 కేసులతో టాప్ లో ఢిల్లీ, మహారాష్ట్ర
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 4 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరింది. వీటిలో 19 కేసులు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినట్టు వెల్లడైంది.
రాష్ట్రంలో కొన్నిరోజుల వ్యవధిలోనే కొత్త వేరియంట్ కేసులు రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ కేసుల్లో దేశంలో ఢిల్లీ, మహారాష్ట్ర చెరో 54 కేసులతో ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ 24 కేసులతో రెండో స్థానంలో ఉంది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటింది.