సక్సెస్ కి మరోపేరే సాయిపల్లవి!
- మంచి పాత్రలకే ప్రాధాన్యత
- డాన్సులలో తిరుగులేని నాయిక
- ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు
- తాజా చిత్రంగా రానున్న 'శ్యామ్ సింగ రాయ్'
తెలుగులో చాలామంది గ్లామరస్ హీరోయిన్స్ ఉన్నారు. యూత్ మనసులను కొల్లగొట్టేసే కథానాయికలు ఉన్నారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన కథానాయిక ఎవరైనా ఉన్నారంటే అది సాయిపల్లవినే. సాయిపల్లవి అంటే నటనలో సహజత్వం. హీరోలతో పోటీపడుతూ డాన్స్ చేయగల సత్తా ఆమె సొంతం. మెగాస్టార్ సైతం ఆమెతో డాన్స్ చేయాలని ఉందనడం అందుకు నిదర్శనం.
సాయిపల్లవి పారితోషికం కంటే పాత్రకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది. పారితోషికం ఎంత ఇస్తానని చెప్పినా తనకి నచ్చని పాత్రను మాత్రం ఆమె చేయదనే మంచి టాక్ ఉంది. తమ సినిమా చేయడానికి సాయిపల్లవి ఒప్పుకుందంటే చాలు అనుకునే యంగ్ హీరోలు చాలామందే ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే శక్తి ఆమెకి ఉందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. సాయిపల్లవి అంటేనే సక్సెస్ అనేమాటను అంగీకరిస్తున్నారు.
ఒక 'ఫిదా' .. ఒక 'మిడిల్ క్లాస్ అబ్బాయి' .. ఒక 'లవ్ స్టోరీ' సినిమా చూస్తే, సాయిపల్లవి ఆ సినిమాలను ఎందుకు అంగీకరించిందనే విషయం అర్థమవుతుంది. ఆ సినిమా విజయంలో ఆమె పాత్ర ఎంత అనేది స్పష్టమవుతోంది. ఆమె తాజా చిత్రమైన 'శ్యామ్ సింగ రాయ్' కోసం అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సాయిపల్లవి కథల ఎంపిక గురించి తెలిసినవాళ్లు, ఈ సినిమా కూడా ఆమె హిట్ చిత్రాల జాబితాలో చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.