మా పిల్లల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు: ప్రియాంక గాంధీ

  • త్వరలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు
  • ముందస్తు దాడులు జరుగుతున్నాయన్న ప్రియాంక
  • ఈ ప్రభుత్వానికి ఇంకేం పనిలేదా అంటూ ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో విపక్షాలపై ముందస్తు దాడులు జరుగుతున్నాయని అన్నారు. తమ పిల్లలు మిరాయా (18), రైహాన్ (20) ల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాకుండా వారి సోషల్ మీడియా కార్యకలాపాలపైనా ప్రభుత్వం నిఘా వేస్తోందని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఇది తప్ప ఇంకేమీ పనిలేదా? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.


More Telugu News