కోలీవుడ్లో కుదురుకునే దిశగా రాజశేఖర్ కూతుళ్లు!
- 'దొరసాని'తో శివాత్మిక పరిచయం
- రీసెంట్ గా శివాని నుంచి వచ్చిన 'అద్భుతం'
- ఇద్దరి అడుగులు కోలీవుడ్ దిశగా
- తక్కువ గ్యాప్ లో ఇద్దరి సినిమాలు రిలీజ్
ఇంతకుముందు స్టార్ హీరోల ఫ్యామిలీస్ నుంచి హీరోలు మాత్రమే వచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది .. స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్స్ గా తెరపై కనిపించడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండటం లేదు. అలా రాజశేఖర్ కూతుళ్లు కూడా హీరోయిన్స్ గా బిజీ కావడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
రీసెంట్ గా శివాని చేసిన 'అద్భుతం' ఓటీటీలో విడుదలైంది. ఇక ఆల్రెడీ 'దొరసాని' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శివాత్మిక, 'రంగమార్తాండ'లోను కనిపించనుంది. ఆ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. ఇక ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కూడా కోలీవుడ్ పై దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు.
తమిళంలో శివాని చేసిన 'అన్బరివు' వచ్చేనెల 7వ తేదీ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. శివాత్మిక చేసిన 'ఆనందం విలయాడుం వీడు' ఈ నెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాల తరువాత తెలుగులో చేస్తూనే, తమిళ సినిమాల్లో కుదురుకోవాలనే ఆలోచనలో వాళ్లు ఉన్నట్టుగా సమాచారం.