భారత్ లో 200కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. సగం కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే!

  • మహారాష్ట్ర, ఢిల్లీల్లో 54 చొప్పున కేసుల నమోదు
  • కోలుకున్న 77 మంది ఒమిక్రాన్ బాధితులు
  • ఇప్పటి వరకు 100 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్
మన దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వైరస్ పాకింది. ఇప్పటి వరకు 200 వరకు కేసులు నమోదయ్యాయి. వీటిలో సగం కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54 కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణలో 20 కేసులు, కర్ణాటకలో 19, రాజస్థాన్ లో 18, కేరళలో 15, గుజరాత్ లో 14 కేసులు నమోదయ్యాయి.

ఇక ఒమిక్రాన్ కు గురైన వారిలో 77 మంది కోలుకున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ ఇప్పటి వరకు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. యూరప్ లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అమెరికాలో సైతం ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుండటంతో అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి.


More Telugu News