కేంద్ర మంత్రి పీయూష్‌ను తెలంగాణ మంత్రులు కలవనున్న వేళ మరో ఆసక్తికర పరిణామం
- మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర మంత్రులకు అపాయింట్‌మెంట్
- అంతకుముందే పీయూష్‌ను కలవనున్న బీజేపీ నేతలు
- ధాన్యం కొనుగోలు అంశంపైనే చర్చ
ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించడానికి తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ ఇవ్వాలని, అప్పటివరకు తాము ఢిల్లీలోనే వేచి చూస్తామని ఇప్పటికే తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకోసం రెండు రోజులుగా వారు నిరీక్షిస్తున్నారు.
ఎట్టకేలకు వారికి పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ దొరికింది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కలవాల్సిందిగా పీయూష్ గోయల్ సమయం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎంత ధాన్యం కొంటుందనేదానిపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని మంత్రులు కోరనున్నారు.
మరోపక్క, ఎంత ధాన్యం వచ్చినా కొంటామని ఇప్పటికే కేంద్ర మంత్రులు ప్రకటించారు. అయితే, ఈ విషయంలో తమకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరితీరతామని తెలంగాణ మంత్రులు స్పష్టం చేశారు. వానాకాలం, యాసంగి కొనుగోళ్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రైతులను గందరగోళపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు.
ఇదిలావుంచితే, తెలంగాణ మంత్రులకు పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్ ఇచ్చిన నేపథ్యంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పీయూష్ గోయల్‌ను బీజేపీ తెలంగాణ నేతలు కూడా కలవనున్నారు. తెలంగాణ మంత్రులతో పీయూష్ గోయల్ సమావేశం కావడానికి ముందే కేంద్ర మంత్రిని బీజేపీ ముఖ్యనేతలు కలవనున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో గోయల్‌ను కలిసేందుకు ఇప్పటికే వారు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. వీరు కూడా ధాన్యం కొనుగోళ్ల అంశంపైనే చర్చించనున్నారు. వరుసగా రాష్ట్ర నేతలు పీయూష్ గోయల్‌ను కలుస్తుండడం ఆసక్తి రేపుతోంది. ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ మంత్రులు, బీజేపీ ముఖ్యనేతల మధ్య ఇటీవల మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే.