అమెరికాలో ఒమిక్రాన్ తొలి మరణం.. వైట్ హౌస్ లో కరోనా కలకలం!
- అమెరికాలో భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
- టెక్సాస్ లోని హారిస్ కౌంటీలో ఒమిక్రాన్ మరణం
- వైట్ హౌస్ ఉద్యోగికి కరోనా సోకడంతో బైడెన్ కు కోవిడ్ పరీక్షలు
అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ కోరలు చాస్తోంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. టెక్సాస్ లోని హారిస్ కౌంటీలో ఓ వ్యక్తి మృతి చెందినట్టు కౌంటీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. మృతుడి వయసు 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపింది. ఆయన ఇంత వరకు వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పింది. ఇప్పటికే ఆయన రెండు సార్లు కరోనా బారిన పడినట్టు సమాచారం.
మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో కరోనా కలకలం రేగింది. శ్వేతసౌధంలో కరోనా కేసు వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం అధ్యక్షుడు జోబైడెన్ తో కలిసి ప్రయాణించిన తన టీమ్ లోని ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా బారిన పడ్డ సదరు ఉద్యోగి బైడెన్ వద్ద దాదాపు 30 నిమిషాలు ఉన్నారని గుర్తించారు. దీంతో బైడెన్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. రేపు మరోసారి బైడెన్ కు పరీక్షలను నిర్వహించనున్నారు.