రామ్మోహన్ నాయుడి ఇంటి వద్ద రక్తపింజరి పాము.. బుసలు కొట్టిన వైనం
- శ్రీకాకుళంలో ఇంటివద్ద గుర్తించిన సిబ్బంది
- వెంటనే హెల్ప్ లైన్‌కు ఫోన్
- పట్టుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలివేత
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి ఇంటి ఆవరణలో అత్యంత విషపూరిత రక్తపింజర పాము తిరుగుతూ అలజడి రేపింది. శ్రీకాకుళం నగరంలోని ఆయన ఇంటి వద్ద ఈ పాము చొరబడడంతో ఎంపీ నివాసంలోని సిబ్బంది దాన్ని గుర్తించారు. అది భయంకరంగా బుసలు కొడుతూ ఉండడంతో భయపడిపోయారు.
దీంతో గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం అందించడంతో ఆ సిబ్బంది వెంటనే ఎంపీ ఇంటి వద్దకు చేరుకున్నారు. పామును పట్టుకుని తీసుకెళ్లారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దాన్ని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని ఓ అధికారి చేసిన సూచన మేరకు పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు.