కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ చిత్తు.. 69 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యం

  • కేఎంసీకి ఆదివారం ఎన్నికలు
  • ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
  • ప్రభావం చూపని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీజేపీ ఇంకా కోలుకోలేదని తాజాగా వెల్లడవుతున్న మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్‌ (కేఎంసీ)కి ఆదివారం ఎన్నికలు జరగ్గా ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి అధికార టీఎంసీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 69 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉండగా, బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించలేదు. కేవలం నాలుగు స్థానాల్లో మాత్రం ఆధిక్యం కనబరుస్తోంది. ఇక, కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రభావం ఇసుమంతైనా కనిపించలేదు. కాంగ్రెస్ రెండు స్థానాల్లో, లెఫ్ట్ పార్టీలు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.


More Telugu News