విపక్షాల ఆందోళనల మధ్య ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం

  • ఇటీవల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
  • నేడు సభలో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
  • కాంగ్రెస్ సహా విపక్షాల వ్యతిరేకత
  • విపక్షాల నిరసనల మధ్యే బిల్లుకు ఆమోదం
  • వాయిదాపడిన లోక్ సభ
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసేలా కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. లోక్ సభలో విపక్షాల ఆందోళనల మధ్య బిల్లుకు ఆమోద ముద్ర పడింది. బిల్లు ఆమోదించిన అనంతరం లోక్ సభ వాయిదా పడింది.

నేటి సమావేశాల్లో భాగంగా ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు ముక్తకంఠంతో ఆరోపించాయి. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కేంద్రం వైఖరి ఉందని మండిపడ్డాయి.


More Telugu News