ఏ మహిళను అవమానించినా అది సమాజానికి మంచిది కాదు: నారా భువనేశ్వరి
- తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్టు కార్యక్రమం
- హాజరైన నారా భువనేశ్వరి
- వరదల్లో నష్టపోయిన వారికి ఆర్థికసాయం
- ఇతరుల వ్యాఖ్యలను పట్టించుకోబోనని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా భువనేశ్వరి నేడు తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏ మహిళను అవమానించినా అది సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. తప్పిదాలకు పాల్పడి పాపాత్ములు అనిపించుకోవద్దని, ఎల్లవేళలా ఇతరుల పట్ల సానుభూతి, దయతో వ్యవహరించి సాయపడదామని పేర్కొన్నారు.
ఇటీవల పరిణామాల నేపథ్యంలో స్పందిస్తూ, ఇతరుల వ్యాఖ్యలను తాను పట్టించుకోబోనని భువనేశ్వరి స్పష్టం చేశారు. వీటిని పట్టించుకుంటూ పోతే సమయం వృథా అన్నారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి ఇటీవల సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన 48 మందికి సాయం అందించారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు. సాయం అందుకున్నవారిలో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందినవారున్నారు.