26 వేలకు పైగా బైకులను వెనక్కి పిలిపిస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్
- క్లాసిక్ 350 బైకుల్లో సాంకేతిక లోపం
- వెనుక బ్రేకు నొక్కినప్పుడు రెస్పాన్స్ బ్రాకెట్ దెబ్బతినే చాన్స్
- సంబంధిత శాఖలకు సమాచారం అందించిన రాయల్ ఎన్ ఫీల్డ్
దర్జా ఒలకబోయడానికి అనువుగా ఉండే మోటార్ సైకిళ్లు అంటే రాయల్ ఎన్ ఫీల్డ్ తయారీ బైకుల గురించే చెప్పుకోవాలి. ఈ అంశంలో దశాబ్దాల తరబడి ప్రజాదరణ పొందడం మామూలు విషయం కాదు. డిజైన్ కు తోడు, సాంకేతికత కూడా ఎంతో ముఖ్యం.
అయితే, 2021 సెప్టెంబరు 1 నుంచి డిసెంబరు 5వ తేదీ మధ్యన తయారైన రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బైకుల్లో సాంకేతిక లోపం ఉన్న విషయం తాజాగా వెల్లడైంది. ఈ బైకుల్లో వెనుక బ్రేకులో సమస్య ఉన్నట్టు కంపెనీ ఇంజినీరింగ్ విభాగం గుర్తించింది.
బ్రేక్ పెడల్ ను బలంగా నొక్కితే రెస్పాన్స్ బ్రాకెట్ పై ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు వెల్లడైంది. చివరికి అది బ్రేకు సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నట్టు విశ్లేషించారు. దాంతో క్లాసిక్ 350 మోడల్ కు చెందిన 26,300 బైకులను వెనక్కి పిలిపించాలని రాయల్ ఎన్ ఫీల్డ్ నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖలకు సమాచారం అందించింది.
సర్వీస్ బృందాలు, లోకల్ డీలర్లు వాహన గుర్తింపు సంఖ్యల ఆధారంగా బైక్ యజమానులకు దీనిపై సమాచారం అందిస్తారని, సమస్యను చక్కదిద్దుతారని వెల్లడించింది.