కంటోన్మెంట్ లో అక్రమంగా మూసివేసిన రోడ్ల జాబితా ఇదిగో.. చూడండి కిషన్ జీ: కేటీఆర్

  • ఇప్పటికైనా న్యాయం చేయండి
  • మూసేసిన రోడ్లను తెరిపించండి
  • కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ పురపాలక మంత్రి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారులను ఇష్టారీతిగా అధికారులు మూసివేస్తుండడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నిలదీశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో అక్రమంగా మూసేసిన రోడ్ల జాబితాను చూపించాలంటూ తనను అడుగుతున్నారని.. 'ఆ జాబితా ఇదిగో' అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

మూసేసిన 27 రోడ్ల వివరాలను ఒక ఇమేజ్ రూపంలో పోస్ట్ చేశారు. అక్కడే కిషన్ రెడ్డి మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించిన వార్త క్లిప్ ను కూడా పోస్ట్ చేశారు. ‘‘ఇప్పటికైనా మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. లక్షలాది ప్రజల సౌకర్యార్థం తక్షణమే అన్ని రోడ్లను తెరిచేలా చూడాలి’’అని కేటీఆర్ కోరారు.

‘‘రక్షణ శాఖకు చెందిన భూమిని స్వాధీనం చేయాలని మున్సిపల్ మంత్రి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్వాధీనం చేసిన మల్కాజ్ గిరి తదితర ప్రాంతాల్లోని రోడ్ల నిర్వహణే సరిగ్గా లేదు. ఇప్పుడు మరిన్ని రోడ్లను అడుగుతున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల జాబితాను ముందు చూపించండి’’ అని కిషన్ రెడ్డి అన్నట్టు కేటీఆర్ పోస్ట్ చేసిన వార్త క్లిప్పింగ్ లో ఉంది.


More Telugu News