అప్పటివరకు ప్రజలు మోసపోతూనే ఉంటారంటోన్న 'గాడ్సే'.. టీజర్ విడుదల
- విడుదల చేసిన చిరంజీవి
- మైండ్ గేమ్ తరహా కథతో గాడ్సే
- గాడ్సే పాత్రలో సత్య దేవ్
- అతడిని పట్టుకునే పాత్రలో ఐశ్వర్య లక్ష్మి
'ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు' అనే ఆలోచింపజేసే డైలాగుతో 'గాడ్సే' సినిమా టీజర్ విడుదలయింది. దర్శకుడు గోపీ గణేశ్, నటుడు సత్యదేవ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం గాడ్సే. ఇందులో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది.
ఈ సినిమాలో సత్య తుపాకులు పట్టుకుని పోరాడుతోన్న సీన్లను చూపించారు. అందరినీ ఆకట్టుకునేలా టీజర్ కట్ చేశారు. మైండ్ గేమ్ తరహాలో ఈ సినిమా కథ కొనసాగుతుందని ఈ టీజర్ ద్వారా అర్థమవుతోంది. సామాజిక అంశాల ఆధారంగా ఈ 'గాడ్సే' కథ రాసుకున్నట్లు తెలుస్తోంది.
'గాడ్సే' టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. హీరో సత్యదేవ్ తో పాటు దర్శకుడు గోపి, సినిమా నిర్మాత సి కల్యాణ్ లను చిరంజీవి అభినందించారు. గాడ్సే పాత్రలో సత్య నటించాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నట్లు టీజర్‌లో చూపించారు. గాడ్సే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? గాడ్సే అసలు పేరు ఏంటీ? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి? అంటూ ఐశ్వర్య లక్ష్మి విచారణ అధికారిణి హోదాలో ప్రశ్నిస్తోంది.
'సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి.. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి.. వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి కానీ, సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయిరా? ఎందుకంటే మీరంతా సేవల పేరుతో ప్రజల డబ్బును కొల్లగొడుతున్నారు' అంటూ సత్యదేవ్ చెబుతోన్న డైలాగు అదుర్స్ అనిపిస్తోంది. అద్భుతమైన మ్యూజిక్‌ను జోడిస్తూ ఈ టీజర్ విడుదల చేశారు.