రూ.8వేలు ఇస్తే చాలు.. వినూత్నంగా వివాహ వేడుక.. పాడేరు ఐటీడీఏ ప్రత్యేక ప్యాకేజీ

  • వినూత్నంగా కల్యాణం
  • గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహణ
  • అతిథులకు విందు భోజనం
  • సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 9493632629  
సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అయితే, మూడుముళ్ల వేడుకను సాదాసీదాగా కాకుండా ఆధునికంగా, అంగరంగ వైభోగంగా నిర్వహించుకోవాలన్నది మరికొందరి ఆకాంక్ష. విభిన్నంగా, వినూత్నంగా, బతికి ఉన్నంత కాలం గుర్తుండిపోయేలా పెళ్లి తంతు జరుపుకోవాలన్నది కొందరి మనోభీష్టం. ఈ నేపథ్యంలో 'గిరిజన సంప్రదాయంలో సహజసిద్ధంగా, నిండైన కళతో పెళ్లి వేడుక జరిపిస్తాం.. రండి' అంటూ ఆహ్వానిస్తోంది ఆంధ్రప్రదేశ్ లోని పాడేరు ఐటీడీఏ.

‘అప్పట్లో ఏదో తూతూ మంత్రంగా మా పెళ్లి అయిపోయింది’ అని అనుకునే వారు కూడా పాడేరు పరిధిలోని పెదలబుడు ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీని ఆశ్రయిస్తే చాలు. మరోసారి వారి వివాహాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తామంటోంది. గిరిజనుల మాదిరే వస్త్రాలు, ప్రత్యేక అలంకరణలతో, గిరిజన పూజారుల మంత్రాలతో, బాజాభజంత్రీల నడుమ కల్యాణం జరిపించేందుకు ఇక్కడ ఒక ప్యాకేజీని కూడా నిర్వహిస్తున్నారు. కేవలం రూ.8 వేలు చెల్లిస్తే చాలు. పెళ్లికి వచ్చే అతిథులకు మంచి విందు భోజనం కూడా ఉంటుంది. తమ కల్యాణాన్ని ఈ రీతిలో చేసుకోవాలనుకునే వారు.. కార్యక్రమం మేనేజర్ ను 9493632629 నంబర్లో సంప్రదించాలి. 


More Telugu News