ఒమిక్రాన్ దెబ్బకు కుదేలవుతున్న మార్కెట్లు.. వెయ్యి పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్!
- మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఒమిక్రాన్
- 1,065 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 319 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
ఒమిక్రాన్ దెబ్బకు యావత్ ప్రపంచం మళ్లీ వణుకుతోంది. యూరప్ లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మన దేశంలో సైతం చాపకింద నీరులా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. ఒమిక్రాన్ ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్యతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోంది. ఉన్నకాటికి షేర్లను అమ్ముకుని లాభాలను స్వీకరించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు కుప్పకూలాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ ఏకంగా 1,065 పాయింట్లు కోల్పోయి 55,945 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 319 పాయింట్లు కోల్పోయి 16,656 వద్ద కొనసాగుతోంది. అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సన్ ఫార్మా, టీసీఎస్ మినహా అన్ని కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.