సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం!
- డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు కార్యాలయాల్లోకి ప్రవేశించకూడదు
- అనధికార వ్యక్తులెవరూ లోపలకు రాకూడదు
- కార్యాలయాల్లోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి ప్రైవేట్ వ్యక్తులకు ప్రవేశాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు సహా అనధికార వ్యక్తులెవరూ కార్యాలయాల్లోకి ప్రవేశించకూడదని ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ రామకృష్ణ మెమో జారీ చేశారు.
అనధికారిక వ్యక్తుల వల్ల రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందని ఏసీబీ నివేదిక అందించింది. తాము సీజ్ చేసిన లెక్కల్లోకి రాని నగదు స్టాంప్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్ల ద్వారానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే వీరి ప్రవేశంపై నిషేధం విధించారు. తమ ఆదేశాలను కాదని కార్యాలయాల్లోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.