ఏపీలో తగ్గిన మద్యం ధరలు.. ఆనందం పట్టలేక లిక్కర్ దుకాణాల వద్ద మందుబాబుల పూజలు
- ఏపీలో తగ్గిన మద్యం ధరలు
- పండుగలా జరుపుకున్న మద్యం ప్రియులు
- దుకాణాలకు హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టిన వైనం
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తగ్గడంతో మందుబాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నాళ్లు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసిన మద్యం ఇప్పుడు కొంత చవగ్గా లభిస్తుండడంతో పట్టపగ్గాల్లేని సంతోషంతో ఉన్నారు. ఇంకొందరైతే మద్యం ధరలు తగ్గడాన్ని పండుగలా జరుపుకున్నారు.
ఈ క్రమంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం దుకాణం వద్ద నిన్న ఏకంగా కొందరు మందుబాబులు పూజలే నిర్వహించారు. దుకాణానికి హారతులు ఇచ్చి పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టిన తర్వాతే మద్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాగా, మద్యం ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆయా బ్రాండ్ మద్యం ధరల్ని బట్టి 15 నుంచి 20 శాతం తగ్గించింది. బ్రాండ్‌ను బట్టి క్వార్టర్‌పై కనీసం రూ. 20 నుంచి రూ. 50 వరకు, ఫుల్ బాటిల్‌పై రూ. 120 నుంచి రూ. 200 వరకు తగ్గించింది. అలాగే అన్ని రకాల బీర్లపై రూ. 20 నుంచి రూ. 30 వరకూ తగ్గింది.