బిగ్ బాస్-5: గ్రాండ్ ఫినాలే నుంచి సిరి అవుట్

  • బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే
  • హౌస్ లోకి ప్రవేశించిన రష్మిక, దేవి శ్రీ ప్రసాద్
  • సిరి ఎలిమినేట్ అయినట్టు ప్రకటన
  • హౌస్ లో ప్రస్తుతం నలుగురు కంటెస్టెంట్స్
బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ లో మొట్ట మొదట ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సిరి. ఫైనల్ వీక్ కు ఐదుగురు అర్హత సాధించగా, వారిలో సిరి కూడా ఉంది. అయితే హౌస్ లోకి వెళ్లిన హీరోయిన్ రష్మిక మందన్న, సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్... సిరి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. వారు ఆమెను స్టేజ్ పైకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా సిరి మాట్లాడుతూ, బిగ్ బాస్ ఇంట్లో తన ప్రస్థానం అద్భుతంగా సాగిందని, తాను ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నానని తెలిపింది. సిరి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మానస్, సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ మిగిలారు.


More Telugu News