కేరళలో పరుగుల రాణి పీటీ ఉషపై చీటింగ్ కేసు నమోదు
- కోజికోడ్ లో ఫ్లాట్ కొనుగోలు చేసిన జెమ్మా అనే మహిళ
- బిల్డర్ కు రూ.46 లక్షలు చెల్లింపు
- బిల్డర్ ఫ్లాట్ అప్పగించడంలేదంటూ ఫిర్యాదు
- పీటీ ఉష హామీతోనే డబ్బు చెల్లించానని ఆరోపణ
భారత స్ప్రింట్ దిగ్గజం, పరుగుల రాణి పీటీ ఉష చిక్కుల్లో పడింది. పీటీ ఉష హామీతో ఓ బిల్డర్ కు డబ్బులు ఇచ్చానని, కానీ బిల్డర్ తనకు ఫ్లాట్ అప్పగించలేదంటూ జెమ్మా జోసెఫ్ అనే మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన కోజికోడ్ పోలీసులు పీటీ ఉషపై కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే... జెమ్మా జోసెఫ్ అనే మహిళ కోజికోడ్ లో ఓ బిల్డర్ నుంచి ఫ్లాట్ కొనుగోలు చేసింది. వాయిదాల పద్ధతిలో ఆ బిల్డర్ కు రూ.46 లక్షలు చెల్లించింది. కానీ బిల్డర్ ఫ్లాట్ అప్పగించలేదు. దాంతో జెమ్మా పోలీసులను ఆశ్రయించింది. పీటీ ఉష చెప్పడం వల్లే తాను ఆ బిల్డర్ నుంచి ఫ్లాట్ కొనుగోలు చేశానని, బిల్డర్, పీటీ ఉష తనను మోసగించారని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పీటీ ఉష, మరికొందరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేశారు.