'పుష్ప' తగ్గేదే లే.. రెండో రోజు కలెక్షన్ల వివరాలు ఇవిగో
- రెండో రోజూ రికార్డు స్థాయిలో వసూళ్లు
- ప్రపంచ వ్యాప్తంగా 116 కోట్ల రూపాయల గ్రాస్
- హిందీలోనూ దూసుకుపోతోన్న 'పుష్ప'
తగ్గేదే లే అంటూ సినిమా వసూళ్లలో పుష్ప రాజ్ దూసుకుపోతున్నాడు. అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' సినిమా మొన్న విడుదలైన విషయం తెలిసిందే. నైజాంలో తొలి రోజే బాహుబలి-2 వసూళ్ల రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఆలిండియా రికార్డు సృష్టించిన 'పుష్ప'... రెండో రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల పరంగా దూకుడు కనబర్చింది.
వీకెండ్ కావడంతో నిన్న ఈ సినిమాను చూసేందుకు అభిమానులు భారీగా ఎగబడ్డారు. బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ ఆవేశం
ఏ మాత్రం తగ్గట్లేదని, రెండో రోజు కూడా ఆలిండియా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిందని మైత్రి మూవీస్ ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా 116 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిందని తెలిపింది. కాగా, హిందీలోనూ పుష్ప సినిమా దూసుకుపోతోంది. మొదటి రోజు హిందీలో రూ.3.05 కోట్లు, రెండో రోజు రూ.4.02 కోట్లు రాబట్టింది. రెండు రోజుల్లో హిందీలో మొత్తం రూ.7.07 కోట్ల నెట్ సాధించింది.
నేడు ఆదివారం కావడంతో ఈ సినిమా ఇదే స్థాయిలో రికార్డులను రాబట్టే అవకాశం ఉంది. నేటి సినిమా టిక్కెట్లన్నీ బుక్ అయిపోయాయంటే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు తొలి రోజుల్లో ఇతర సినిమాలు సాధించిన రికార్డులన్నింటినీ 'పుష్ప' బద్దలు కొడుతోంది. కరోనా వేళ 'పుష్ప' ఈ రికార్డులు బద్దలు కొడుతూ ప్రేక్షకులను మళ్లీ సినిమా థియేటర్ల వైపునకు మళ్లేలా చేస్తోంది.
'పుష్ప' బాక్సాఫీస్ వద్ద తెస్తోన్న ఊపువల్ల సంక్రాంతికి విడుదల కానున్న మరికొందరు పెద్ద హీరోల సినిమాలకూ ప్లస్ కానుంది. టాలీవుడ్ లో ఇప్పటికే బాలకృష్ణ 'అఖండ' సినిమా కూడా దూసుకుపోతోంది. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పిస్తూ పుష్ప కూడా దూసుకుపోతుండడంతో టాలీవుడ్ లో పండుగ వాతావరణం నెలకొంది.