2020 మార్చి నుంచి ఎన్నడూ లేనంత కనిష్ఠస్థాయికి కరోనా యాక్టివ్ కేసులు
- దేశంలో కొత్తగా 7,081 కరోనా కేసులు
- నిన్న 264 మంది మృతి
- యాక్టివ్ కేసుల సంఖ్య 83,913
- మృతుల సంఖ్య మొత్తం 4,77,422
దేశంలో కొత్తగా 7,081 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 7,469 మంది కోలుకున్నారు. కరోనా వల్ల నిన్న 264 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో మొత్తం 83,913 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు.
యాక్టివ్ కేసుల సంఖ్య 2020, మార్చి నుంచి ఇంత తక్కువగా ఉండడం ఇదే తొలిసారి. కరోనా నుంచి ఇప్పటి వరకు మొత్తం 3,41,78,940 మంది కోలుకున్నారు. కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,77,422కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 137,46,13,252 డోసుల వ్యాక్సిన్లు వాడారు.