ఆయన పార్టీ టికెట్ సంపాదించుకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా: పరిటాల శ్రీరామ్ సవాల్

  • ఓ మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యలు
  • అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న శ్రీరామ్
  • పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని పార్టీ శ్రేణులకు సూచన
ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టణంలోని దుర్గానగర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన గౌరవసభ-ప్రజా సమస్యలపై చర్చావేదిక కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ్ మాట్లాడుతూ.. ధర్మవరంలో టీడీపీ టికెట్ తెచ్చుకుంటానని ఓ నాయకుడు ప్రచారం చేసుకుంటున్నారని, నిజంగానే ఆయన టికెట్ తెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని ఓ  మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అయినా, టీడీపీ కార్యకర్తలు ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరు దృష్టిసారించాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్ అని, ఈ విషయాన్ని ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని పరిటాల శ్రీరామ్ కోరారు.


More Telugu News