రోడ్డు ప్రమాద బాధితులకు తొలి 48 గంటలు ఉచిత వైద్యం: స్టాలిన్
- ప్రమాదంలో గాయపడిన వారికి తొలి 48 గంటలు ఎంతో కీలకం
- అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్న సీఎం
- ఏ ప్రాంతం వారైనా తమిళనాడులో ప్రమాదం జరిగితే పథకం వర్తింపు
అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన పాలనతో ముద్ర వేసుకుంటూ ముందుకెళ్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తొలి 48 గంటలు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇన్నుయిర్ కాప్పోమ్ (ప్రాణాలను కాపాడదాం) పేరుతో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇన్నుయిర్ కాప్పోమ్-నమైకాక్కుమ్-48 పథకం కింద తొలి 48 గంటలు వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం 201 ప్రభుత్వ ఆసుపత్రులు, 408 ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వం ఎంపిక చేసింది.
బాధితులు ఏ ప్రాంతం వారైనా, ఏ దేశం వారైనా తమిళనాడులో ప్రమాదం జరిగితే ఈ పథకం వర్తిస్తుంది. ప్రమాదాల్లో గాయపడిన వారికి తొలి 48 గంటలు ఎంతో కీలకం కావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. చెంగల్‌పట్టు జిల్లా మేల్ మరువత్తూర్‌లోని ఆదిపరాశక్తి వైద్య కళాశాలలో స్టాలిన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.