హోదా ముగిసిన అధ్యాయం అన్నవారు సిగ్గుతో తలదించుకోవాలి: చలసాని శ్రీనివాస్

  • బీహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తున్నట్టు నీతి ఆయోగ్ వ్యాఖ్య
  • ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా రాదన్నవారు తమ మాటలను సరిచేసుకోవాలని సూచన
  • అభివృద్ది కోసం తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకే తాటిపైకి రావాలన్న చలసాని
బీహార్‌కు ప్రత్యేక హోదా విషయాన్ని పరిశీలిస్తున్నట్టు నీతి ఆయోగ్ ఇటీవల చేసిన ప్రకటనపై ఏపీ విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయమేనని మాట్లాడినవారు ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. నిన్న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు నీతి ఆయోగ్ తెలిపిందని గుర్తు చేసిన చలసాని.. ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండబోదన్న వారు తమ మాటలను సవరించుకోవాలని సూచించారు. అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకేతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. అలాగే, ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలకు కారణమైన నీటి సమస్యలను కూడా పరిష్కరించుకోవాలని కోరారు.


More Telugu News