'మజిలీ' బ్యూటీకి కాలం కలిసొచ్చినట్టే!

  • 'మజిలీ'తో లభించిన తొలి హిట్టు
  • రవితేజ సరసన ఆటాపాట
  • సందీప్ కిషన్ జోడిగా ఛాన్స్
  • తమిళ్ లోను మొదలైన దూకుడు  
తెలుగు తెరకి ఈ మధ్యకాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో దివ్యాన్ష కౌశిక్ ఒకరు. చైతూ .. సమంత ప్రధానమైన పాత్రలను పోషించిన 'మజిలీ' సినిమాలో, దివ్యాన్ష కూడా మరో కథానాయికగా నటించింది. చందమామలాంటి ఈ అమ్మాయిని తెరపైన చూసిన కుర్రాళ్లంతా అభిమానులుగా మారిపోయారు.

'మజిలీ' సినిమా హిట్ కావడంతో, ఇక ఈ సుందరి జోరు కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఎందుకనో ఆ సినిమా క్రెడిట్ ఆ అమ్మాయి ఖాతాలోకి వెళ్లడం కష్టమైపోయింది. చైతూ - సమంత జంటకి గల క్రేజ్ కారణంగా ఈ బ్యూటీ గ్లామర్ పక్కకి వెళ్లిపోయింది. ఇప్పుడిప్పుడే ఈ అమ్మాయి మళ్లీ పుంజుకుంటోంది.

తమిళంలో సిద్ధార్థ్ జోడీగా ఒక సినిమా చేస్తున్న దివ్యాన్ష, తెలుగులో 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో నటిస్తోంది. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో, రవితేజ జోడీగా ఆమె కనిపించనుంది. ఇక తాజాగా సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న 'మైఖేల్' సినిమాలో కథానాయికగా ఈ బ్యూటీనే తీసుకున్నారట. నారాయణదాసు నారంగ్ - రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో, విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.


More Telugu News