రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు పన్నులు కడుతుంటే..: రోజా
- రియలెస్టేట్ వ్యాపారుల కోసం ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారు
- భూముల రేట్లు పెంచుకోవడం కోసమే అమరావతి రైతుల పోరాటం
- ఇంతకాలం ముసుగు వేసుకున్నవాళ్లు జగన్ పై విషం కక్కుతున్నారు
అమరావతి రియలెస్టేట్ వ్యాపారుల కోసం ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలో భూముల రేట్లను పెంచుకోవడం కోసమే అమరావతి రైతుల పోరాటం కొనసాగుతోందని అన్నారు. నగరిలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు పన్నులు కడుతుంటే... ఇతర పార్టీల నేతలు కేవలం అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు బాగుండాలని కోరుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఇంతకాలం ముసుగు వేసుకున్న దొంగలు ఇప్పుడు జగన్ పై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. నిన్న తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన సభ గురించి మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల సభలో పాల్గొన్న చంద్రబాబు సహా ఇతర నాయకులందరూ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.