'పుష్ప'లో అంతమంచి రోల్ చేయనన్నాడట!
- కరోనా వచ్చినప్పుడు భయపడిపోయాను
- ఒంటరిగా ఒక గదిలో రోజులు గడిపాను
- సుకుమార్ మామూలు మనిషిని చేశాడు
- ఆయన దేవదూతలాంటివాడన్న అజయ్ ఘోష్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ప్రతి పాత్రను సుకుమార్ డిజైన్ చేసిన తీరు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. ఈ సినిమా చూసిన వారికి ముఠా నాయకుడు కొండారెడ్డి పాత్ర ప్రేక్షకులకు చాలాకాలం పాటు గుర్తుండిపోతుంది. ఆ పాత్ర అజయ్ ఘోష్ కి మంచి పేరును తెచ్చిపెట్టింది.
తాజా ఇంటర్వ్యూలో అజయ్ ఘోష్ మాట్లాడుతూ .. "నాకు కరోనా వచ్చి కోలుకున్న రోజులవి. కరోనా వచ్చి తగ్గిన తరువాత మనుషులను చూస్తే భయం .. వాళ్లతో మాట్లాడాలంటే భయం .. అసలు ఇల్లుదాటి బయటికి వెళ్లాలంటేనే భయం. ఒంటరిగా ఓ గదిలో ఉండేవాడిని. అలాంటి పరిస్థితులను నేను ఒంటరిగా అనుభవిస్తుండగా ఈ సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది.
నాకున్న భయం కారణంగా నేను ఈ సినిమా చేయలేనని చెప్పాను. అయినా సుకుమార్ నాతో నేరుగా ఫోన్లో మాట్లాడారు. నాకు ధైర్యం చెప్పడమే కాకుండా, నన్ను ఎంతో గౌరవంగా చూసుకున్నారు. నేను మళ్లీ మామూలు మనిషిని కావడానికి ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. అలాంటి ఆయనను నేను ఒక డైరెక్టర్ గా కాదు .. దేవదూతగా చూస్తాను" అంటూ చెప్పుకొచ్చాడు.